![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 7 తో మోస్ట్ పాపులర్ అయినవారిలో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్.. వీరితో పాటుగా సీరియల్ బ్యాచ్ లోని ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లకి కూడా ఎంతో కొంత ఫ్యాన్ బేస్ వచ్చింది. అయితే హౌస్ లో కాస్త ఇంటలిజెన్స్ గా ఉండేవారిలో టేస్టీ తేజ ఒకడు. ఇక బిగ్ బాస్ తర్వాత ప్రియాంక జైన్, శోభాశెట్టి లతో కలిసి వ్లాగ్స్ చేసిన తేజ.. ఇప్పుడు అమర్ దీప్, తేజస్విని గౌడతో కలిసి వ్లాగ్ చేశాడు.
టేస్టీ తేజ విత్ అమర్ దీప్ అనే క్యాప్షన్ తో ఓ వీడియోని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ బ్యాచ్ తో ఎప్పుడు ఉండే టేస్టీ తేజ.. అందరితో ఫన్ చేస్తూ సరదాగా ఉండేవాడు. జబర్దస్త్ లో మూడొందలకు పైగా స్కిట్ లలో చేసి, ఆ తర్వాత ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ సొంతంగా టేస్టీ తేజ అనే యూట్యూబ్ ఛానెల్ ని రన్ చేస్తున్నాడు. ఇందులో తను ఏ వ్లాగ్ పోస్ట్ చేసిన అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. అద్బుతాహార హోటల్ కి అమర్ దీప్ ని తీసుకెళ్ళిన టేస్టీ తేజ.. అక్కడ తనతో ఫుడ్ వ్లాగ్ ని చేశాడు.
ఇక్కడ వీడియో చేస్తే ఎవరైన అద్భుతమైన వ్యక్తితోనే చేయాలని ఇన్నిరోజులు ఆగానని అమర్ దీప్ తో టేస్టీ తేజ అనగా.. రేయ్ తిడుతున్నావా? పొగుడుతున్నావారా అని అమర్ దీప్ అన్నాడు. నీకు వెజ్ ఆ నాన్ వెజ్ ఆ అని టేస్టీ తేజ అడుగగా.. వెజ్ అని అమర్ అంటాడు. అలా అమర్ అనగానే.. నువ్వు నరరూప రాక్షసుడివి బ్రో అని తేజ అన్నాడు. మనిద్దరిం హౌస్ లో ఉన్న రోజులలో ది బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయో అంటే.. అవి మనం ఇద్దరం బెడ్ మీద పడుకున్నవే అని అమర్ అన్నాడు. నా పేరు తేజ కానీ వాడు నాలో అప్పుడప్పుడు తేజుని చూసుకునేవాడు. నా భాద ఎవరితో చెప్పుకోవాలని తేజ అన్నాడు. మొదట అమర్ ని బ్రో అని పిలిచే వాడిని అలా గడుస్తూ ఉంటే ఒరేయ్ అరేయ్ అని కూడా వచ్చేదని అయినా తీసుకోగలిగాడు. నా కన్నా ఏజ్ లో పెద్దోడైన మంచోడని అమర్ దీప్ గురించి తేజ అన్నాడు. ఆ తర్వాత ఈ వ్లాగ్ లో తేజస్విని గౌడ యాడ్ అయింది. మా జర్నీలో ఇది అవ్వకుండా ఉంటే బాగుండేదని నీకు ఏమైనా అన్పించాయా అని తేజస్విని గౌడని తేజ అడుగగా.. తను ఆలోచిస్తుంటుంది. తను ఆలోచిస్తుంది కానీ మనకి చాలానే ఉన్నాయని అమర్ తో తేజ నవ్వుతూ అనేసాడు. తేజ అనేవాడు ఓ నిండు బెలూన్ లాంటివాడు. చూడటానికి అందంగా ఉంటాడు. అందంగా మాట్లాడతాడు. కానీ మంచివాడని తేజ గురించి అమర్ దీప్ అన్నాడు. ఇలా ఈ వ్లాగ్ లో బిగ్ బాస్ హౌస్ లో వారి మధ్య జరిగిన వాటిని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నారు.
![]() |
![]() |